లోక్ సభ ఎలక్షన్స్ : క్రికెట్ vs బాక్సింగ్

SMTV Desk 2019-04-23 15:16:47  loksabha elections, gautam gambhir, indian cricketer, indian boxer, vijender singh, bjp, congress

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోరులో మరో క్రీడకు చెందిన ఆటగాడు బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ సోమవారం లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి విజేందర్ సింగ్‌తో కలిపి ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. దీనికోసం ముందుగానే సిద్ధమైన విజేందర్.. డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఈయనకు పోటీగా బీజీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ పోటీ చేయనున్నారు. విజేందర్ స్వస్థలమైన హర్యానాకు దక్షిణ ఢిల్లీ స్థానం దగ్గరగా ఉండటంతో .. జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓట్లు విజేందర్‌కు అనుకూలంగా వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.మరో వైపు ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా గౌతం గంభీర్ పోటీ చేయనున్నారు. గంభీర్‌కు ఫ్రత్యర్థిగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అరవింర్ సింగ్ లవ్లీ పోటీచేస్తున్నారు.