ఇద్దరు బాలీవుడ్ భామలు నో చెప్పేసారు...

SMTV Desk 2019-04-23 13:27:20  rrr, rajamouli

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి డైరక్షన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్, ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ డైసీ ఎడ్గర్‌ని ఖరారు చేసి ప్రకటన విడుదల చేసారు. అయితే ఇంతలో డైసీ ఎడ్గర్‌ చిత్రం నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకుంది. అప్పటి నుంచి చిత్ర బృందం ఎన్టీఆర్‌ సరసన నటించే హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నుంచి శ్రద్ధా కపూర్, పరిణితీ చోప్రాలను పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఇద్దరూ నో చెప్పేసారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

శ్రద్దా ఇప్పటికే ప్రభాస్‌ సరసన ‘సాహో’లో చేస్తుంది. ఇదే కాకుండా వరస ప్రాజెక్టులతో ఆమె బిజీగా పోనీ పరిణితీ చోప్రా దగ్గరకు వెళ్తే ఆమె ఇప్పుడిప్పుడే డెంగ్యూనుంచి పూర్తిగా కోలుకుని తన తదుపరి చిత్రం సైనా నెహ్వాల్ బయోపిక్‌కు సంబంధించిన పనుల్లో బిజీ కానుంది. మొత్తం మీద పరిణితికి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించే లేకుండా పోయింది. మరి చివరికి ఏ హీరోయిన్ ఎన్టీఆర్ పక్కన ఉంటుందో చూడాలి.

ఇక వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు