నిరుద్యోగులకు మరో శుభవార్త.

SMTV Desk 2019-04-23 13:22:33  SSC jobs,

నిరుద్యోగులకు మరో శుభవార్త. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్) నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో సుమారు 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఖాళీల వివరాలను ప్రకటించకపోయినా ఆ నోటిఫికేషన్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు చేయడానికి 2019 మే 29 చివరి తేదీ. రెండు అంచెల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నిమాయకం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

మెట్రిక్యూలేషన్ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. టైర్-1 పరీక్ష జూలై 2 నుంచి ఆగస్ట్ 6 మధ్య, టైర్-2 పరీక్ష నవంబర్ 17న ఉంటుంది. టైర్-1, టైర్-2 పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ విధానంలో ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోండి.

ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేయండి. హోమ్‌ పేజీలో ‘log-in’ సెక్షన్‌లో ‘register now’ పైన క్లిక్ చేయండి. మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. దరఖాస్తు పూర్తి చేయి ఇమేజెస్ అప్‌లోడ్ చేయండి. చివరగా పేమెంట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఎంపికైన వారికి రూ.20,200 వరకు వేతనం లభిస్తుంది.