ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-04-23 13:21:45  hyderabad, hyderabad uppal stadium, rajiv gandhi international stadium hyderabad, ipl 2019, ipl 2019 final match, bcc, hyderabad high rainsi

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. ఈ క్రమంలో స్టేడియంలో సౌత్ పెవీలియన్ బైలాక్‌లో షెడ్డు, ఓ ఎల్ఈడీ కుప్పకూలాయి. ఈదురు గాలులు తాకిడికి ఎనభై శాతం సౌత్ పెవీలియన్ దెబ్బతిన్నది. అయితే సోమవారం ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఎల్బీ స్టేడియంలో ఫ్లెడ్ లైట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే.