ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన హాస్యనటుడు వ్లోడిమిర్‌ జెలెన్‌ స్కీ

SMTV Desk 2019-04-23 13:20:38  Ukrainian comedian and presidential candidate Volodymyr Zelenskiy, Comedian Volodymyr Zelenskiy, Ukraine

ఉక్రెయిన్‌: ప్రముఖ హాస్యనటుడు వ్లోడిమిర్‌ జెలెన్‌ స్కీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో 41ఏళ్ల జెలెన్‌ స్కీకి 73.22 శాతం ఓట్లతో పెట్రో పొరోషెంకోపై ఘన విజయం సాధించారు. కామెడీ స్కిట్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్కీ ప్రజల మన్ననలు పొందారు. సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌ కామెడీ టీవీ సీరియల్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా నటించిన జెలెన్‌ స్కీ.. ఈ సీరియల్‌ ముగిసిన నెలరోజుల్లో ప్రెసిడెంట్‌ గా విజయదుందుబి మోగించారు. ఇకఅత్యధిక మెజార్టీతో గెలిచిన జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.