అలహాబాద్ హైకోర్టులో ఉద్యోగాలు

SMTV Desk 2019-04-23 13:18:22  Jobs, Translation jobs

అలహాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అలహాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ ట్రాన్స్‌‌లేటర్ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి అప్లై చేసేందుకు ఏప్రిల్ 25ని చివరితేదీగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
పోస్టు : జడ్జిమెంట్ ట్రాన్స్‌లేటర్

అర్హత : ఏదైనా డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణత
వయసు : 01.07.2019 నాటికి 21 -35 సంవత్సరాల మధ్య ఉండాలి
ఎంపిక : డిస్క్రిప్టివ్ ట్రాన్స్‌లేషన్ టెస్ట్, హిందీ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేదీ : ఏప్రిల్ 25వెబ్‌సైట్ : http://ahcjt.cbtexam.in/