ఎయిర్‌టెల్ టూవీలర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రారంభం!!!

SMTV Desk 2019-04-23 13:16:11  airtel payments bank, airtel, airtel two wheeler insurance police, bharathi axa general insurance company

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఇన్సూరెన్స్ సేవలను అందించేందుకు సిద్దమవుతుంది. ఎయిర్‌టెల్ టూవీలర్ ఇన్సూరెన్స్ సర్వీసులు అందించేందుకు నిర్ణయించుకొని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల 70 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. వార్షిక ప్రీమియం, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, థర్డ్ పార్టీ లయబిలిటీ ప్రొటెక్షన్, ఇన్‌స్పెక్షన్ ఫ్రీ రెన్యూవల్ వంటి ప్రయోజనాలు పొందొచ్చని వివరించింది. టూవీలర్ ఎక్కడైన నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లేందుకు ఉచిత టోవింగ్ సర్వీసులు కూడా అందిస్తున్నామని పేర్కొంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం వల్ల ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ అవుతామని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సంజీవ్ శ్రీనివాస్ తెలిపారు. మైఎయిర్‌టెల్ యాప్ సాయంతో టూవీలర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే 40,000 ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ పాయింట్ల వద్ద కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లేనివారు కూడా పాలసీ పొందొచ్చు. ఇకపోతే కొత్త టూవీలర్ కొనుగోలు సమయంలో ఐదేళ్ల మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సుప్రీం కోర్టు 2018లోనే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.