తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే

SMTV Desk 2019-04-23 13:13:53  rgv, kcr,

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే గిఫ్ట్ అంటూ ‘టైగర్ కేసీఆర్’ మూవీకి సంబంధించి వెన్నుపోటు పాటను రిలీజ్ చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు. ఈ పాటలో మా భాష మీద నవ్వినం..మా ముఖాల మీద ఊసినవ్. మా బాడీల మీద నడిసిన ఆంధ్రుడా ..వస్తున్నా..తాట తీయనీకి వస్తున్న అంటూ టైగర్ కేసీఆర్ వస్తుండు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఈ వీడియోపై రామ్ గోపాల్ వర్మ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా మరోసారి వివరణ ఇచ్చుకున్నాడు. కేసీఆర్ తన పోరాటాన్ని ఆంధ్ర ప్రజలపై కాకుండా.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన, మోసం చేసిన ఆంధ్రానాయకులపైనే ఈ చిత్రం ఉంటుందని వర్మ చెప్పుకొచ్చాడు. కేసీఆర్‌కు తెలుగు ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన పోరాట మంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే అంటూ వివరణ ఇచ్చాడు.