తాత బయోపిక్ కంటే నాని సినిమా ఎక్కువైందా ?

SMTV Desk 2019-04-22 19:04:13  NTR, NTR Biopic,

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి దొరికిపోయాడు. తారక్ పై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఇందుకు కారణం తారక్ నాని జెర్సీపై ప్రశంసలు కురిపించడమే. ఎందుకంటే ? ఎన్ టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ ఎన్ టీఆర్ కథానాయకుడు, పార్టీ ఎన్ టీఆర్ మహానాయకుడు విడుదలైనప్పుడు తారక్ నిశబ్ధంగా ఉన్నారు. తాత బయోపిక్ గురించి మాట కూడా మాట్లాడలేదు.

అలాంటిది ఇప్పుడు నాని జెర్సీ సినిమాని ఏ రేంజ్ లో పొగిడేశాడు నాని. ఇదే నందమూరి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తాత బయోపిక్ కంటే నాని సినిమా ఎక్కువైందా ? అని నిలదీస్తున్నారు. మరీ.. అభిమానుల విమర్శలపై తారక్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది చూడాలి. ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.