ఏపీలో టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు

SMTV Desk 2019-04-22 17:22:19  TDP, Chandrababu,

ఏపీలో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ... వంద శాతం కాదు.. వెయ్యిశాతం తామే గెలుస్తామని అన్నారు సీఎం చంద్రబాబునాయుడు. ఈరోజు పార్టీ నేతలతో అమరావతిలో సమీక్ష నిర్వహించిన ఆయన ఆ తర్వాత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కోసం క్యూలో వుండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని తెలిపారు. మీరు అంతా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి. ప్రజల అవసరాలు తీర్చండి.. అని ఆదేశించారు. అదేవిధంగా చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తెలిపిన బాబు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా... తమదే విజయమని బాబు స్పష్టం చేశారు.

అంతేకాకుండా జూన్‌ 8 వరకు మన ప్రభుత్వం ఉందని.. ఫలితాలు వచ్చేంతవరకు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు ఆదేశించారు. క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా? ప్రధాని మోడీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా?అంటూ ఆయన ప్రశ్నించారు. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా కేంద్రం అన్ని విధాలుగా అడ్డుకుంటుందని చంద్రబాబు వివరించారు.