ట్విట్టర్‌లో ఆ హీరో కు 3 మిలియన్ల ఫాలోవర్స్

SMTV Desk 2019-04-22 15:59:27  Twitter, NTR,

టాలీవుడ్ యంగ్ టైగర్ యన్టీఆర్..కు టాలీవుడ్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ అంతా..ఇంతా కాదు. కేవలం తన సినిమాలతో కాదు..అభిమానులను అతను చూసుకునే విధానం..వాళ్లకు అండగా ఉండటం వంటి అంశాలు తారక్‌ను ఫ్యాన్స్‌కు మరింత చేరువ చేశాయి. ఫ్యాన్స్‌ను సొంతం కుటుంబంలా ఎన్టీఆర్ చూసుకుంటాడు. ఆ విషయం తానే పలు బహిరంగ వేదికల్లో చెప్పాడు కూడా. ఎప్పుడూ అభిమానులకు మొదటి ప్రాధాన్యమిచ్చే తారక్ సోషల్ మీడియాలో కూడా వారికి అందుబాటులో ఉంటారు. అందుకే ట్విట్టర్‌లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆ సంఖ్య మూడు మిలియన్ల మార్కును చేరుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.