టీఎస్ ఇంటర్ బోర్డు ముందు రేవంత్ ధర్నా....అరెస్టు

SMTV Desk 2019-04-22 15:25:29  revanth reddy, congress party, telangana state intermediate board of education

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఎదుట కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు సోమవారం ధర్నాకు దిగారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఐతే పోలీసులు రేవంత్‌, సంపత్‌లను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఇంటర్‌ బోర్డు ఆఫీసు ముట్టడికి ఏబివిపి కార్యకర్తలు యత్నించారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్‌ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించాలని విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు.