టిక్‌టాక్‌ రీఎంట్రీ!!!

SMTV Desk 2019-04-22 15:19:43  tik tok, central government, indian central government banned tik tok, supreme court

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ ను ఇండియాలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. మద్రాస్ హైకోర్టు సూచనల మేరకు కేంద్ర ఐటీ శాఖ ఆపిల్, గూగుల్ సంస్థలకు లేఖలు రాస్తూ… టిక్‌టాక్ అప్లికేషన్‌ను ఇండియాలో తొలగించాలని కోరింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యాప్‌పై మాద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ టిక్‌టాక్‌ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ కేసును సోమవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనను విన్న తర్వత తుది నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకు నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించింది. ఏప్రిల్‌ 24వ తేదీన తమ వాదనలను వినిపించాల్సిందిగా టిక్‌టాక్‌ సంస్థకు సూచించింది.