టిటిడి బంగారం తరలించాల్సింది వారే : టిటిడి ఈవో

SMTV Desk 2019-04-22 15:17:30  tirumala tirupati devasthanam, punjab national bank, ttd eo anil kumar

తిరుమల: టిటిడి బంగారం తరలించే పూర్తి బాధ్యతలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌దేనని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు. ఆయన ఈ వివాదంపై ఈ రోజు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బంగారం ఎలా తరలిస్తారో తమకు అవసరం లేదని, ఏ వాహనంలో తీసుకొచ్చినా జాగ్రత్తగా బంగారాన్ని టిటిడికి అప్పగించాల్సిన బాధ్యత పిఎన్‌బిదేనని స్పష్టం చేశారు. గోల్డ్‌ డిపాజిట్‌ స్కీం 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైందని, టిటిడికి సంబంధించిన 5,387 కిలోల బంగారం ఉంది. పిఎన్‌బిలో 1381 కిలోల బంగారం వేశాం, అది 2019 ఏప్రిల్‌ మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016లో ఏప్రిల్‌లో పిఎన్‌బిలో 1381 కిలోల బంగారం వేశామని అన్నారు. అది ఏప్రిల్‌ 2019 ,ఏప్రిల్‌ 18కి మెచ్యురిటీ అయిందని, ఈ అంశంపై పిఎన్‌బికి లేఖ రాసినట్లు తెలిపారు. బంగారం తరలింపు పూర్తి బాధ్యత పిఎన్‌బిదేనని అన్నారు. తాము మార్చి 27న లేఖ రాసేటపుడు ఏప్రిల్‌ 18న బంగారం ఇమ్మని చెప్పమని, ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌ 20న బంగారం అందజేశారని చెప్పారు. బంగారం తమకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరంలేదని బంగారం తమకు అందిందా లేదా అనేదే ముఖ్యమని సింఘాల్‌ వివరించారు.