జయప్రదపై కేసు నమోదు చేసిన పోలీసులు

SMTV Desk 2019-04-22 13:29:15  police case filed in jayaprada, bjp, loksabha elections, election commission, rampoor constituency

లక్నో: ప్రముఖ సినీ నటి జయప్రదపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి బిజెపి ఎంపి అభ్యర్థిగా ఆమె లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్పీ అధినేత్రి మాయావతి, రాంపూర్ ఎస్ పి అభ్యర్థి ఆజంఖాన్ లపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసి ఎక్కడెక్కడ చూశారంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 18వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశంపై ఇసి సీరియస్ గా తీసుకొని ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పోలీసులు జయప్రదపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక రాంపూర్‌ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంది. ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్‌రే నోరారా పొగిడిన భూలోక సుందరి జయప్రద ఇక్కడి నుంచే పోటీ చేయడం రాంపూర్‌ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.