ట్రంప్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే

SMTV Desk 2019-04-22 13:19:21  Donald Trump,

శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల మీద సంతాపాన్ని తెలియజేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆయన్ని విమర్శల పాలు చేసింది. పేలుళ్లలో ఏకంగా 138 మిలియన్ల మంది చనిపోయారని.. 600 మందికి పైగా గాయపడటం పట్ల అమెరికా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిజానికి పేలుళ్లలో అప్పటి వరకు చనిపోయింది 150మంది మాత్రమే కానీ ఈయన మాత్రం ఏకంగా 138మందిని మిలియన్లు చేసేశారు. ట్వీట్‌లో జరిగిన పొరపాటును తెలుసుకొని ట్రంప్‌ ఆ ట్వీట్‌ తొలగించి మరో ట్వీట్ చేశారు.

కానీ అప్పటికే స్క్రీన్ షాట్ నెటిజన్లకు దొరికింది. శ్రీలంక జనాభా మొత్తం సుమారు 2.1కోట్లుంటే ఈయన ఏకంగా 138 మిలియన్ల మంది ఎలా చనిపోయారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పాపం పొరపాటున చేసిన ట్వీట్‌ తో ఆయనని తెగ విమర్శిస్తున్నారు. కొలంబోలో చర్చిలు, హోటళ్లపై జరిగిన ఉగ్రదాడి బాధితులకు ట్రంప్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఆపద సమయంలో శ్రీలంకకు అన్ని విధాలా సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ ప్రకటించారు.