బ్రహ్మానందంపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదు

SMTV Desk 2019-04-22 12:51:01  Bramhandnandam, sunil

టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందంపై ఓ భయంకరమైన ప్రచారం ఉంది. ఆయన కొత్తవారిని ఎదగనివ్వరు. తొక్కేస్తారు. దర్శక-నిర్మాతలని చాలా రకాలుగా ఇబ్బందిపెడతారనే ప్రచారం జరిగింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో సునీల్ బ్రహ్మీపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. బ్రహ్మానందంపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదు.

‘ఇక్కడ ఎవరూ ఎవరినీ తొక్కేయలేరు. మనల్ని మనమే తొక్కేసుకుని, మన చేతకానితనాన్ని మరొకరిపై వేసేస్తుంటాం. బ్రహ్మానందంగారు సినిమాలు తీయలేదు. నటించారంతే. అలాంటప్పుడు ఆయన ఎలా తొక్కేస్తారు? ఈతరం కమెడియన్లను కూడా ఇంటికి పిలిపించుకుని, భోజనం పెట్టి మరీ పంపిస్తారాయన’ అన్నారు సునీల్.