ఎన్నికల తర్వాత మొదటిసారి పార్టీ నేతలతో

SMTV Desk 2019-04-21 17:02:27  pawan kalyan

ఎన్నికల ముందు వరకు జోరుగా కదిలిన పవన్ పోలింగ్ తరవాత ఒక్కసారే ఒక్కసారే సైలెంట్ అయిపోయారు. టీడీపీ, వైకాపా నేతలు మాదే గెలుపుని, ఇన్ని సీట్ల మెజారిటీ వస్తుందని హోరాహోరీగా ఫైట్ చేసుకుంటున్నా పవన్ ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎం మిషన్ల వ్యవహారంపై ఢిల్లీలో చంద్రబాబు పోరాటం, ఆయనకి వ్యతిరేకంగా వైకాపా వాదనలు ఇలా రెండు ప్రధాన పార్టీలు వేడి వేడిగా వ్యవహరిస్తుంటే పవన్ కనీసం స్పందించలేదు.

దీంతో జనసేన పార్ట్ టైమ్ రాజకీయాలకే పరిమితమని, పోలింగ్ అయిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. జనసేన కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయనే పుకార్లు కూడా లేచాయి. వీటన్నిటి నడుమ పవన్ ఈరోజు బయటికొచ్చారు. ఎన్నికల తర్వాత మొదటిసారి పార్టీ నేతలతో గుంటూరు జిల్లా మంగళగిరి కార్యాలయంలో మీటింగ్ పెట్టారు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సమావేశంలో ఎన్నికల సరళి ఎలా జరిగింది, అభ్యర్థుల ప్రచారం ఎలా ఉంది, గెలుపు అవకాశాలు
ఎంతవరకు ఉన్నాయి వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరగనుందట. మొదటి విడతగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అభ్యర్థులతో మాట్లాడుతున్న పవన్ త్వరలోనే మిగతా జిల్లాల అభ్యర్థులతో కూడా చర్చలు జరుపుతారట. మరి పవన్ బహిరంగంగా మీడియా ముందుకు వస్తే అభిమానులకు, కార్యకర్తలకు కూడా కొంత ఊరటగా ఉంటుంది.