టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం

SMTV Desk 2019-04-21 16:57:27  TDP

ఏపీలో తెలుగుదేశం పార్టీదే మళ్ళీ అధికారమని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన మళ్ళీ సీఎం చంద్రబాబే అని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులు కొన్ని పార్టీలకు మద్దతుగా ఉండటం సరికాదని వివరించారు.

అదేవిధంగా 43రోజుల పాటు పరిపాలన సాగనివ్వకుండా స్తంభింప చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఆపధర్మం కాదు.. అలాంటప్పుడు పరిపాలనపై సమీక్షలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తే ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బంది ఏముందని ఆయన విమర్శించారు. వర్షాకాలం ముందు పూర్తి కావలసిన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకపోతే ఎలా అని ఆయన అన్నారు. మోడీ నియంతృత్వానికి ఇదొక నిదర్శనమని బుచ్చయ్య చౌదరి వివరించారు.