వాణిజ్య బ్యాంక్ లు శనివారం కూడా పని చేయాల్సిందే: ఆర్బీఐ

SMTV Desk 2019-04-21 16:56:11  reserve bank of india, private banks, government banks, rbi

న్యూఢిల్లీ: వాణిజ్య బ్యాంక్ లు వారంలో అయిదు రోజులు మాత్రమే పని చేయాలని ఆర్బీఐ ఆదేశాలిచ్చినట్టు అనేక వార్తలొస్తున్నాయి. అయితే వీటిపై స్పందించిన ఆర్బీఐ....వాణిజ్య బ్యాంకులకు వారంలో 5 రోజులే పని దినాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులకు ఆదివారాలతో పాటు రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవు ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన శనివారాల్లో రోజువారీ సమయ వేళల ప్రకారమే యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.