ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌లను తలదన్నే జ్ఞానంతో భారత సంతతి బాలుడు

SMTV Desk 2017-08-19 12:10:22  British TV Show, Child genius show, Indian origin, Rahul, IQ, Social media

బ్రిటన్, ఆగస్ట్ 19: రాత్రికి రాత్రి ఎవరు గొప్ప వారు కాలేదు అనే హితవు ప్రతీ ఒక్కరు వినే ఉంటారు. అయితే బ్రిటన్‌కి చెందిన భారత సంతతి 12 ఏళ్ల బాలుడు మాత్రం ఒకే రాత్రిలో సెలబ్రిటీ అయిపోయాడు. అదేలా అంటారా? బ్రిటన్‌లోని ఓ టీవీ ఛానల్‌‌లో ప్రసారమ‌వుతున్న‌ చైల్డ్‌ జీనియస్ అనే షోలో తన సమాధానాలతో దుమ్ము రేపుతున్నాడు. ప్రస్తుతం రాహుల్ ఐక్యూ 162గా ఉంది. ఈ విలువ ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ షోలోని మొదటి రౌండ్‌లో రాహుల్‌ 14 ప్రశ్నలకు సరైన‌ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 8–12 ఏళ్ల వయసున్న‌ 20 మంది బాలలతో జరుగుతున్న ఈ షో వారం రోజులపాటు జరిగిన తరువాత ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటిలో ఇప్పటి వరకు జరిగిన స్పెల్లింగ్‌ టెస్ట్‌లో రాహుల్‌ పూర్తి మార్కులు పొందగా, జ్ఞాపక శక్తికి సంబంధించిన 15 ప్రశ్నల్లో 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుత హాట్ టాపిక్ గా చైల్డ్ జీనియస్ రాహుల్ మారాడు. ఒక ట్విట్టర్ అభిమాని అయితే ఒక అడుగు ముందుకేసి రాహుల్ ఉత్తర కొరియా, అమెరికా మధ్య శాంతి చర్చలు జరపగలడు అంటూ ట్వీట్ చేశాడు