మార్కెట్లో మోదీ గోల్డ్ రింగ్స్

SMTV Desk 2019-04-21 12:54:40  loksabha elections, narendra modi, indian prime minister, pm modi, pm modi gold rings, modi silver rings

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలను వ్యాపారులు తమ అమ్మకాలు పెంచుకునేందుకు బాగానే వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బంగారు రింగ్ లు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాజ్‌కోట్‌లో ప్రధాని మోడీ ఫొటో కలిగిన బంగారు ఆభరణాలు వ్యాపారులు విక్రయిస్తున్నారు. రాజ్‌కోట్‌లోని సోనీబజార్ లో ప్రధాని మోడీ ముఖచిత్రం కలిగిన రింగులను డిజైన్ చేశారు. ఉంగరంపై బిజెపి చిహ్నమైన కమలం గుర్తుతో పాటు మోడీ ముఖచిత్రం కూడా ఉంది. ఈ ఉంగరాలు గుజరాత్‌లోనే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు 12 రాష్ట్రాల్లో లభ్యమవుతున్నాయి. ఈ ఉంగరాలను బంగారంతోనే కాకుండా వెండితోనూ రూపొందిస్తున్నారు. వీటి ధర రూ.1000 నుండి రూ. 30 వేల వరకు ఉంది.