మీ కలల కోసం ఫైట్ చేయండి

SMTV Desk 2019-04-21 12:53:35  Sai Dharam Tej,

చిత్రలహరి హిట్ కిక్కులో ఉన్నాడు సాయిధరమ్ తేజ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరో చిత్రలహరి తెరకెక్కింది. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రలహరి హిట్ టాక్ తో రన్ అవుతోంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ లని నిర్వహించింది.

ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ సక్సెస్ సూత్రం చెప్పారు. ”ఈ సినిమా సక్సెస్ అయింది.. బాగా కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు కానీ.. నా దృష్టిలో సక్సెస్ అంటే అది కాదు. సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే. ఎంతో మంది సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. అదే బిగ్గెస్ట్ సక్సెస్ అనుకుంటున్నా. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు. నా టీంతో పాటు ఈ సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. మీ కలల కోసం ఫైట్ చేయండి. ఇది జరగదు అని ఎంత చెప్పినా వినకండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. పోరాడండి.. కచ్చితంగా సక్సెస్ దక్కుతుంది” అన్నారు తేజ్.