ముంభైపై అలవోకగా గెలిచిన రాజస్తాన్

SMTV Desk 2019-04-21 12:51:42  rr vs mi, ipl 2019, rohit sharma, steave smith

జైపూర్: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్... ముంభైపై 5 వికెట్ల తేడాతో అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన ముంభై రోహిత్ శర్మ (5) వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (34: 33 బంతుల్లో 1x4, 1x6) బ్యాట్ ఝళిపించలేకపోయాడు. కానీ.. తొలి ఓవర్‌ నుంచే టాప్ గేర్‌లో దూసుకెళ్లిన డికాక్.. ఏ దశలోనూ జోరు తగ్గించలేదు.జట్టు స్కోరు 111 వద్ద డికాక్ ఔటవగా.. అనంతరం వచ్చిన కీరన్ పొలార్డ్ (10: 7 బంతుల్లో 1x6), హార్దిక్ పాండ్య (23: 15 బంతుల్లో 2x4, 1x6), బెన్‌ కటింగ్ (13: 9 బంతుల్లో 1x4, 1x6) హిట్టింగ్‌కి ప్రయత్నించినా.. పరుగుల్ని రాబట్టలేకపోయారు. మొత్తానికి ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఛేదనలో మాజీ కెప్టెన్ రహానె (12), బెన్‌స్టోక్స్ (0) నిరాశపరిచినా.. సంజు శాంసన్ (35: 19 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన స్టీవ్‌స్మిత్.. ఆ తర్వాత యువ హిట్టర్ రియాన్ పరాగ్ (43: 29 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి జట్టుని విజయతీరాలకి చేర్చాడు. అయితే.. ఆఖర్లో పరాగ్‌తో పాటు టర్నర్ (0) ఔటైనా.. స్టువర్ట్ బిన్నీ (7 నాటౌట్: 4 బంతుల్లో 1x4)తో కలిసి స్మిత్ 19.1 ఓవర్లలో గెలుపు లాంఛనాన్ని 162/5తో పూర్తి చేశాడు. సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్‌లాడి ఏకంగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. రాజస్థాన్ సొంతగడ్డపై ఈ మ్యాచ్‌ జరుగుతుండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం.