బీజేపీ లోకి బాలీవుడ్ హీరో

SMTV Desk 2019-04-21 12:45:33  Sunny deol, BJP, amit shah

బాలీవుడ్ నుంచి మరో నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న సన్నీ డియోల్ బీజేపీలో చేరతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సన్నీ డియోల్ భేటీ అయిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. పూణేలోని సన్నీ డియోల్ ఫామ్ హౌస్ లో వీళ్లిద్దరూ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పంజాబ్ లోని మూడు లోక్ సభ స్థానాలకు బీజేపీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. పార్టీ ప్రతిష్టకు కీలకంగా భావిస్తున్న అమృత్ సర్ నుంచి సన్నీని పోటీకి దింపాలని అమిత్ షా భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ నేత తరుణ్ రాఠీ శుక్రవారం సాయంత్రం తన ట్విట్టర్ వాల్ పై ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రియ మిత్రుడు సన్నీ డియోల్ తో కలిసి లోక్ సభ ఎన్నికలపై చర్చించాను అని రాఠీ రాశారు. అయితే మిగిలిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.