మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు అఖిల్ మూవీ .. ఈ సారైనా హిట్ కొడతాడా?

SMTV Desk 2019-04-21 12:43:57  Akhil, Kaira advani

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ దక్కలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఆయనకు నిరాశే మిగిల్చింది. ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న అఖిల్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. కాగా ఈ చిత్రం మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని చూస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.