నారా లోకేష్ గెలుపు కోసమే

SMTV Desk 2019-04-20 18:16:50  Nara Lokesh,

నారా లోకేష్ గెలుపు కోసమే చంద్రబాబు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కోట్లాది రూపాయల డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని అన్నారు. అర్థరాత్రి వరకూ ఓటింగ్ జరగడం.. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వంపై వ్యతిరేకతకి నిదర్శనమన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందులో భాగమే వైసీపీపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.