విక్కీ కౌశల్ కి గాయాలు

SMTV Desk 2019-04-20 16:30:21  Uri, vicky kaushal

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారమ్. ‘యూరీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్కీ కౌశల్. ప్రస్తుతం ఆయన బాను ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న గుజరాత్ హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోనే విక్కీ కౌశల్ గాయపడ్డారు.

యాక్షన్ సీన్స్ లో నటిస్తుండగా డోర్ పై పడ్డ విక్కీ కౌశల్ కి తీవ్ర గాయాలయ్యాయి. దవడ ఎముక పగిలి రక్తం వచ్చింది. వెంటనే చిత్ర యూనిట్ సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అనంతరం ముంబైలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ విక్కీకి పదమూడు కుట్లు వేసినట్లు చిత్రబృందం తెలిపింది.