క్రికెటర్లకు షాకిచ్చిన బిసిసిఐ!... భార్యలకూ.. ప్రియురాళ్లకు దూరమే

SMTV Desk 2019-04-20 12:56:45  Cricketers, BCCI,

ముంబయి: ప్రపంచకప్ కు ఎన్నికైన 15 మంది భారత జట్టు ఆటగాళ్లకు బిసిసిఐ షాకిచ్చింది. బిసిసిఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం టోర్నీ ప్రారంభమైన మొదటి 20 రోజుల వరకు భారత క్రికెటర్లు తమ వెంట భార్యలు, ప్రియురాళ్లను తీసుకెళ్లడానికి వీలులేదు. దాంతో నెలన్నర పాటు జరిగే ప్రపంచకప్ లో కేవలం పదిహేను రోజులే మాత్రమే ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. అంతేగాక మ్యాచ్‌లకు వెళ్లేటప్పుడు ఆటగాళ్ల బస్‌లో వారి ఫ్యామిలీలు వెళ్లడానికి కూడా వీల్లేదట. మరో ప్రత్యేక వాహనంలో వారిని తరలిస్తారు. గతంలో తొలి రెండు వారాల తర్వాత ఆటగాళ్ల కుటుంబ సభ్యులను వారితో ఉండటానికి అనుమతించేవారు. ఇక మే 22న ఇంగ్లండ్‌ వెళ్లనున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. 31వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.