ఉత్కంఠభరితమైన పోరులో ఆర్సీబీ విజయం

SMTV Desk 2019-04-20 10:45:48  RCB, Virat kohli,

2019 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా 7 మ్యాచ్‌లు ఓడిపోయి అందరి చేత విమర్శలు ఎదుర్కోంది. కానీ మొన్న జరిగిన 8వ మ్యాచ్, నిన్న జరిగిన 9వ మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడి మరీ ఆ విమర్శలను తిప్పికొడుతోంది. ముఖ్యంగా బెంగళూరు కెప్టెన్ కోహ్లీ దూకుడుగా ఆడి జట్టుకు రెండో విజయాన్ని అందించాడు.

శుక్రవారం కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌‌కతా నైట్ రైడర్స్ చివరి వరకూ పోరాడి ఓటమి పాలైంది. ఆండ్రీ రస్సెల్, 25 బంతుల్లో 65 పరుగులు, 46 బంతుల్లో 85 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరి ఆటతో కోల్‌కతా విజయం ఖాయం అనుకుంటున్న సమయంలో బెంగళూరు బౌలర్లు స్టోనిస్, మొయిన్ అలీలు కోల్ కతా ఆటగాళ్లను కట్టడి చేశారు. వీరిద్దరూ తప్ప కోల్ కతా బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువ స్కోరు చేయలేకపోయారు. క్రిస్ లిన్(1), సునీల్ నరైన్(18), శుభ్ మాన్ గిల్(9), రాబిన్ ఊతప్ప(9), దినేశ్ కార్తీక్(0)పరుగులు మాత్రమే చేశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు.. మొదటి 10 ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లు నష్టానికి 214 పరుగుల లక్షాన్ని కోల్ కతా ముందుంచింది.

కెప్టెన్ కోహ్లీ 58 బంతుల్లో 100 పరుగులు చేయగా.. మొయిన్ అలీ 28 బంతుల్లో 66తో విజృంభించారు. పార్థివ్ పటేల్(11), అక్షదీప్ నాథ్(13), మార్కస్ స్టోనిస్(17)పరుగులు చేశారు.