రైతులకు ఎలాంటి నష్టం లేదు!!

SMTV Desk 2017-06-02 17:45:32  arunjaitley, animal protection, finance ministar

న్యూఢిల్లీ, జూన్ 2 : మూగజీవాలను, జంతువులను సంరక్షించడం ఆదేశిక సూత్రం కిందకు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వెల్లడించారు. పశువుల సంతలు రైతుల కోసం పెడతారు తప్ప వ్యాపారుల కోసం కాదని .. పశువుల సంత వద్ద అమలు చేసే నిబంధనల ద్వారా రైతులకు కలిగే ఇబ్బంది ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. వధించే నిమిత్తం సంతల్లో పశువుల క్రయవిక్రయాలను కేంద్రం నిషేధించడం జరిగిందని ..రాష్ట్రాల చట్టాలతో సంబంధం లేదని ఆయన వివరించారు.పశువుల వధకు సంబంధించి ప్రతి రాష్ట్రానికి స్వీయ చట్టాలు ఉంటాయని, అదే సమయంలో కొన్ని జంతువులను, మూగజీవాలను కాపాడాలనే రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలు నిర్ధ్యేశిస్తున్నాయని వెల్లడించారు. గోవులను వధించేవారిని శిక్షించడం పై చట్టం ఉండాలా వద్ద అనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బహిరంగంగా దూడను నరికి చంపిన ఘటనలో 8 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కన్నూర్ లోను పశువధ నిషేధం పై బీఫ్ ఫేస్ట్ ను నిర్వ హించడం..వధించిన దూడ మాంసాన్ని పంచిపెట్టడం వివాదాస్పదమైంది.