చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి .. చెరువు సిద్ధాంతి జోస్యం!

SMTV Desk 2019-04-20 10:40:23  Chandrababu, Cheruvu siddanthi, tdp, ycp, janasena

నేతలంతా జుట్టు పీక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ట్రెండ్ ఆధారంగా ఇప్పటికే రెండు పార్టీలు తామే విజయం సాధిస్తాయని ప్రకటించాయి. మహిళల ఓటింగ్ తమకు లాభం చేకూరుస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఐదేళ్ల బాబు పాలనపై కోపంతోనే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరి ఓటేశారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఉత్కంఠను తమ జ్యోతిష్యంతో చెక్ పెడతామని ఓ జ్యోతిష్యుడు చెబుతున్నాడు. తన పాత లెక్కలను కూడా వివరిస్తున్నాడు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి చెరువు సిద్ధాంతి మరాటా జోస్యం అన్ని మీడియా, పత్రికల్లో పతాక శీర్షికన వస్తోంది. కర్ణాటకలోని దేవమ్మ తల్లి శక్తి అనుగ్రహం తనకు ఉందని.. 12 ఏళ్లుగా తల్లి అనుగ్రహంతో తాను చెబుతున్న జోస్యం నిజమైందని ఆయన వివరిస్తున్నారు.

ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఈసారి అనుభవానికే పట్టం కట్టారని జ్యోతిష్యుడు మరాఠా అభిప్రాయపడ్డారు. 2012 ఎన్నికల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడని మరాఠా చెప్పిన జోస్యం నిజమైంది. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోడీ గెలుస్తాడని చెప్పాడు.. అదీ నిజమైంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన సిద్ధాంతి మరాఠా మాటలు నిజమయ్యాయి. ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఈయన టీడీపీయే గెలుస్తందన్నాడు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫలితం పై కూడా అనుభవానికే పెద్దపీట అన్నాడు.

అయితే జ్యోతిష్యం సంగతి ఎలా ఉన్నా ఏపీలో వైసీపీ గాలి ఉందని జాతీయ సర్వేలన్నీ కుండబద్దలు కొడుతున్నాయి. టీడీపీ శిబిరం, చంద్రబాబు కూడా ఇదే ఆందోళనతో ఉన్నారు.మరి ఈ జ్యోతిష్యుడు నమ్మకాలు నిజమవుతాయా? లేదా సర్వేల ఆధారంగా ప్రస్ఫూటిస్తుందా అనేది మే 23న తేలనుంది. అప్పటి వరకూ ఈ గాలి మాటల జ్యోతిష్యాలను నమ్మితే నమ్మొచ్చు.. లేదంటే లేదు.