బోయపాటి – బాలయ్యల సినిమా ప్రారంభం అప్పుడే

SMTV Desk 2019-04-19 18:29:55  boyapati, balayya,

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సిన సినిమా ఇది. ఎన్నికలు ఉండటంతో వాయిదా పడింది. శుక్రవారం బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నూతన చిత్రం ప్రారంభించనున్నట్లు బోయపాటి ప్రకటించారు. ఐతే, మే 23న ఎన్నికల ఫలితాల తర్బాతే బోయపాటి – బాలయ్యల సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.