రకుల్ ప్రీత్ సింగ్ పై కింగ్ నాగ్ ఫైర్ .. నిజమేనా ?

SMTV Desk 2019-04-19 17:24:22  Rakul Preet Singh, Nagarjuna

నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మథుడు 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఐతే, షూటింగ్ లో నాగ్ రకుల్ పై ఫైర్ అయినట్టు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ చిత్రం “దే దే ప్యార్ దే” సినిమా కోసం రకుల్ భారీగా సైజులు తగ్గించింది. ఏకంగా 10కిలోల బరువు తగ్గింది. ఐతే, మన్మథుడు2లో మాత్రం ఆమె చబ్బిగా కనిపించాల్సి ఉంటుంది. దీంతో బరువు పెరగమని దర్శకుడు చెప్పాడట. ఐతే, రకుల్ మాత్రం ఏమాత్రం సైజులు పెంచడం లేదట. దీంతో రకుల్ పై నాగ్ ఫైర్ అయినట్టు వార్తలు వినిపించాయి.

తాజాగా, ఈ ప్రచారంపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ” రకుల్ ని నాగార్జున కోప్పడ్డారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. పోర్చుగల్ లో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె మాతోనే ఉన్నారు. సెట్స్ పై ఎప్పుడూ రకుల్ ప్రీత్ అందం గురించే డిస్కషన్ జరిగేది. ప్రతిభావంతురాలైన రకుల్ లాంటి నటి మా సినిమాలో ఉన్నందుకు అదృష్టంగా ఫీలవుతుంటాం తప్ప ఆమె బరువు విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు” అన్నారు రాహుల్.