సరికొత్త లుక్ లో మెగా హీరో

SMTV Desk 2019-04-19 12:25:09  Mega Hero, Varun tej, Valmiki

సినీ పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన మెగా హీరో వరుణ్ తేజ్ తేజ్ ప్రస్తుతానికి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే చిత్రం లో నటిస్తున్నాడు. కాగా రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడే ఘనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి సంబందించిన కొత్త లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

వరుణ్ తేజ్ లుక్ చుసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. గడ్డం, చెవిపోగుతో, విభిన్నమైన కొత్త ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే తొలి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్‌ అయాంక్‌ బోస్‌కు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. అందరు కూడా ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.