జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణను బ్రాండింగ్ చేసింది టీడీపీనే

SMTV Desk 2019-04-19 12:07:01  Prof. Nageshwar Rao, tdp, jd lakshmi narayan rao

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డిపై న‌మోదైన కేసుల విచార‌ణ‌లో భాగంగా నాడు సీబీఐ అధికారిగా ఉన్న జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆయ‌న విధులను నిర్వ‌హించారేత‌ప్ప, అంత‌కు మించి అక్క‌డ జ‌రిగింది ఇంకేమీ లేద‌ని ప్ర‌ముఖ పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అన్నారు. కాగా, ఇటీవ‌ల మీడియా ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న ఆయ‌న జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు వైఎస్ జ‌గ‌న్‌తో ఎటువంటి పాత క‌క్ష‌లు లేవ‌న్నారు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు చెరువు వ‌ద్ద పంచాయ‌తీ లేదు, పొలాట గ‌ట్ల మీద గొడ‌వ‌లు లేవు, అంత‌కు మించి ఇద్ద‌రి మ‌ధ్య భూ త‌గాదాలు లేవు అంటూ ప్రొ.నాగేశ్వ‌ర్ అన్నారు. చాలా మంది ఆ ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు ఉన్న‌ట్టుగా చెబుతున్నార‌ని, అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని నాగేశ్వ‌ర్ చెప్పారు. జేడీ ల‌క్ష్మీ నారాయణ‌కు కేసు విచార‌ణ‌లో మాత్రం యాంటి జ‌గ‌న్ అన్న పేరు వ‌చ్చింద‌న్నారు. జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు ఆ బ్రాండింగ్ రావ‌డం వెనుక తెలుగుదేశం పార్టీ హ‌స్త‌ముంద‌ని, జ‌గ‌న్ కేసుల‌ విచార‌ణ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో టీడీపీ శ్రేణులే ఎక్కువగా జ‌గ‌న్ మీద కోపంతో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణను బ్రాండింగ్ చేశారన్న‌ది ప్రొ.నాగేశ్వ‌ర్ మాట‌.