అధికారంలోకి మళ్ళీ టిడిపినే : చంద్రబాబు

SMTV Desk 2019-04-18 19:37:24  ap cm, ap cm chandrababu, cm chandrababu, ap elections

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోష్యం చెప్పారు. రాష్ట్రంలో మళ్ళీ టిడిపి జెండా ఎగురుతుంది అని పార్టీకి దాదాపు 120కి పైగా సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్నాకే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఇకపోతే గురువారం ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.