KKR కు షాక్....రసెల్ కు గాయం

SMTV Desk 2019-04-18 19:35:42  KKR, RCB, IPL 2019, ANDREW RUSSEL

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సంచలన ఆటగాడు ఆండ్రీ రసెల్ నెట్లో ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్ మియాంద్ మంజ్రేకర్ విసిరిన బంతి వేగంగా వెళ్లి రసెల్‌ మెడ భాగంలో బలంగా తాకడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. చాలా సేపటి వరకూ ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయిన రసెల్.. అనంతరం ఫిజియో సపర్యల తర్వాత నడుచుకుంటూ స్టేడియం వెలుపలికి వెళ్లి.. అక్కడి నుంచి కారులో హోటల్‌కి వెళ్లిపోయాడు. అతను విలవిలలాడిన తీరుని చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. బెంగళూరుతో మ్యాచ్‌‌లో రసెల్ ఆడటం అనుమానమే.