టీం మొత్తానికి ఒకేసారి గాయలవచ్చు : రవిశాస్త్రి

SMTV Desk 2019-04-18 18:33:11  team india, team india head coach ravi shastri, ravi shastri, icc world cup 2019

ముంభై: వరల్డ్ కప్ టోర్నీకి సెలెక్ట్ చేసిన భారత ఆటగాళ్ళ పై టీంఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ...వరల్డ్ కప్‌కు దేశం నుంచి 16మందిని తీసుకోవాలని ఐసీసీకి సూచించినట్లు తెలిపాడు. ఏప్రిల్ 17 బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును విడుదల చేస్తూ.. ఇది ప్రైమరీ జట్టు మాత్రమే అని ప్రస్తావించింది. అంటే పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మరోసారి తమ తుది జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అని అయితే ఈ క్రమంలో జట్టు ప్రకటించకముందే ఐసీసీతో స్క్వాడ్‌లో 16మందితో ఉంటే బాగుంటుందని సూచించారన్నారాయణ. ఆ విషయాన్ని ఐసీసీ ఆమోదించకపోవడంతో 15మంది జాబితానే విడుదల చేశాం. భారత్ నుంచి పంత్.. రాయుడులకు జట్టులో అవకాశాలు దక్కలేదని నిరుత్సాహపడాల్సిన పని లేదు. టోర్నీ మొత్తంలో ప్లేయర్లకు గాయాలు కావొచ్చు. ఏమైనా జరగొచ్చు. అంతేకానీ, ఇలాంటి దానికే ఏదో ఘోరం జరిగిపోయిందనే బాధను వ్యక్తం చేయనవసర్లేదు అని జట్టులో ఎంపిక కాని ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేలా రవిశాస్త్రి వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ జట్టుతో పాటు ముగ్గురు బౌలర్లను జట్టు సహాయకులుగా, మరో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రకటించింది బీసీసీఐ.