'యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్' టాప్ 1లో బజ్‌రంగ్ పూనియా

SMTV Desk 2019-04-18 18:11:07  Indias star wrestler Bajrang Punia, Wrestling Revamps Ranking Series System, Names 2019 Host Locations,

బుధవారం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్ గా భారత స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్‌ 61 కేజీల విభాగంలో బజరంగ్‌ 58 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత సంవత్సరం నవంబర్ నెలలో బజ్‌రంగ్ మొదటిసారిగా నంబర్‌వన్ ర్యాంక్‌ అందుకున్నాడు. గతేడాది జరిగిన ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో బజరంగ్‌ స్వర్ణం పతకాలు సాధించాడు. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో సత్తా చాటాడు. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో బజరంగ్‌ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. చైనా వేదికగా ఏప్రిల్ 23న ప్రారంభమయ్యే ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.