స్టాండ్‌బై లిస్టులోకి మరో ఇద్దరు

SMTV Desk 2019-04-18 16:24:02  icc world cup 2019, rishab pant, ambati rayudu, navdeep saini, bcci, ishanth sharma, akshar patel

ముంభై: ఐసిసి వరల్డ్ కప్ కు ఎంపిక చేయని రిషబ్ పంత్, అంబటి రాయుడు, నవదీప్ సైనీలను తాజాగా బీసీసీఐ స్టాండ్‌బై ఆటగాళ్ళ లిస్టులో వారికి అవకాశం కల్పించింది. అయితే ఈ లిస్టులోకి మరో ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ లిస్టులో పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ, స్పిన్నర్ అక్షర్ పటేల్లు చేరారు. దీంతో మొత్తం అయిదుగురు ప్లేయర్లు స్టాండ్‌బై ఆటగాళ్లు లిస్టులో ఉన్నారు. అయితే భారత జట్టుతో నవదీప్ సైనీ ఒక్కడే వెలుతాడని సమాచారం తెలుస్తోంది.స్టాండ్‌బైలో ఉన్న మిగితా నలుగురు.. జట్టులో ఎవరైనా గాయపడినా లేదా జట్టు అవసరాన్ని బట్టి ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. మొత్తం అయిదుగురు స్టాండ్‌బై ప్లేయర్లలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు, ఇద్దరు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌ ఉన్నారు. ఇంగ్లాండ్ పిచ్ లు పేస్ కు స్వర్గధామం. దీంతో జట్టుతో మరో అదనపు పేసర్ ఉండాలని భావించిన జట్టు నవదీప్ సైనీని తీసుకెళుతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.