ఆ కారణంతో... రష్మిక పెళ్లి క్యాన్సిల్ అయిందా ?

SMTV Desk 2019-04-18 16:23:04  Vijay Devarakonda, Rashmika

హీరోయిన్ రష్మిక మందన ‘కిరాక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లాడాల్సి వుంది. వీరికి ఎంగేజ్మెంట్ అయింది. ఐతే, అది పెళ్లి వరకు వెళ్లలేదు. దీనికి కారణం తెలుగులో రస్మిక హీరోయిన్ గా బిజీ అవ్వడమే అనే ప్రచారం జరిగింది. ఛలో, గీత గోవిందం సినిమాలతో వరుస హిట్స్ అందుకొని జోరుమీదుంది. అందుకే పెళ్లిని కూడా క్యాన్సిల చేసుకొందనే ప్రచారం జరిగింది.

ఐతే, అసలు నిజం అది కాదట. ‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక -విజయ్ ల మధ్య లిప్ లాక్ సీన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీన్ పై రక్షిత్ శెట్టి ఫ్యామిలీ అభ్యంతరం చెప్పిందట. గొడవ కూడా చేశారట. సినిమా పరిశ్రమలో ఇవన్ని సహజమని రక్షిత్ అర్ధం చేసుకున్నా అతని ఫ్యామిలీ మాత్రం పెద్ద గొడవ చేశారట. అందుకే రష్మిక ఫ్యామిలీ అతనితో పెళ్లి క్యాన్సిల్ చేశారట. ప్రస్తుతం రష్మిక సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ-రస్మిక జంటగా నటించిన రెండో చిత్రం డియర్ కామ్రేడ్ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.