కొత్త రూ.50 నోటు

SMTV Desk 2019-04-18 16:20:12  indian currency, reserve bank of india, demonetization, indian new 50 rupees currency

న్యూఢిల్లీ: దేశంలో నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ కొత్త నోట్లను విడుదల చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా రూ.50 నోటు నూతన సిరీస్ చలామణిలోకి తెస్తోంది. గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్ రూ.50 నోటు త్వరలోనే చలామణిలోకి రానుందని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది. ఈ కొత్త సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బిఐ మంగళవారం ప్రకటించింది. 2017 ఆగస్టులో గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఫ్లోరోసెంట్ నీలి రంగు కల్గిన కొత్త రూ.50 నోటును ఆర్‌బిఐ జారీ చేసిన విషయం తెలిసిందే.