కాళేశ్వరానికి మరో 20 వేల కోట్ల వ్యయం

SMTV Desk 2019-04-18 16:14:56  kaleshwaram project, telangana government

కాళేశ్వరం: రాష్ట్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు కాళేశ్వరానికి మరో 20 వేల కోట్లు పెరుగుతుందని తెలుస్తుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు లక్ష కోట్లు దాటుతుందని ఇరిగేషన్‌ శాఖ వర్గాలు అంటున్నాయి. గోదావరి నుంచి 160 టిఎంసిల నీటిని ఎత్తి పోసేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి 80,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకూ నీటి లభ్యత ఉన్న సమయంలో రోజుకు రెండు టిఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశారు. దీనికి అనుగుణంగా వర్షాకాలంలో రోజుకు రెండు టిఎంసీల చొప్పున 160 టిఎంసీల నీటిని ఎత్తి పోస్తారు. ఎత్తిపోసిన నీటిలో 140 టిఎంసీలు నిల్వ చేసేందుకు చిన్నవి, పెద్దవి కలిపి 20 రిజర్వాయర్లు నియమిస్తున్నారు. మిగిలిన 13 టిఎంసీలతో చెరువులు నింపాలని ప్లాన్‌ చేశారు.