జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తి...వీడియో వైరల్

SMTV Desk 2019-04-18 16:14:03  GVL Narshimharao, Chandrababu, Nara lokesh, AP, Vishaka utsav, Member of rajyasabha, KCR, Shoe Hurled At BJP Leader GVL Narasimha Rao During Press Meet

న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావుపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. తాజాగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో సమావేశం ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మీడియాతో భోపాల్ నుంచి సాధ్వి ప్ర‌గ్యాను ఎందుకు ఎన్నిక‌ల్లో నిల‌బెట్టామో తెలియ‌జేస్తున్నారు జీవిఎల్‌. సాధ్వి ప్ర‌గ్యాతో కాంగ్రెస్‌కు స‌మ‌స్య ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అప్పుడే.. మీడియా సమావేశం జరుగుతుండగానే అక్కడున్న ఓ వ్య‌క్తి చెప్పుని విసరేశాడు, అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి.. చెప్పు విసిరిన వ్యక్తిని బయటకు లాక్కెళ్లాడు. దీనికి పాల్పడ్డ వ్యక్తి కాన్పూర్ నివాసిగా అధికారులు చెబుతున్నారు. అతనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.