ఐదు నిమిషాల ఎంట్రీ సీన్ కోసం 50 కోట్లా?

SMTV Desk 2019-04-18 15:55:00  RRR, RRR entry scene,

బాహుబలి తర్వాత దాన్ని మించే సినిమా తీయాలనే ఉద్దేశంతో పెద్ద స్కెచ్చే వేశాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. ఆర్.ఆర్.ఆర్ అని ఎనౌన్స్ మెంట్ చేసిన దగ్గర నుండి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఆ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ కథతో వస్తుందని చెప్పగా ఇక ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఇద్దరు హీరోల ఎంట్రీ సీన్ కూడా అదిరిపోద్దట.

ఒకటి రెండు కాదు ఈ ఇద్దరు హీరోల ఎంట్రీ సీన్ కోసమే 50 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట. ఐదు నిమిషాల ఎంట్రీ సీన్ కోసం 50 కోట్లా అని అవాక్కవ్వొచ్చు కాని ఆర్.ఆర్.ఆర్ అంచనాలకు మించి ఉండాలంటే ఈమాత్రం చేయాల్సిందే అంటున్నారు. సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తాడని తెలిసిందే. ఆయన ఇంట్రడక్షన్ కూడా గ్రాండ్ గా ఉంటుందని తెలుస్తుంది.