కార్మికుడిగా సల్మాన్‌ ఖాన్‌

SMTV Desk 2019-04-18 15:49:21  salman khan, Bollywood

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘భారత్‌’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ, టబు, సునీల్‌ గ్రోవర్‌, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాలో సల్మాన్‌ పలు రకాల గెటప్‌లలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారని చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే సల్మాన్‌ విభిన్న పాత్రలతో వైరెటీగా కనిపిస్తున్న పోస్టర్లను ఒక్కొక్కటిగా సినిమా యూనిట్‌ విడుదల చేస్తోంది.

మొదట నెరిసిన జుట్టు, గడ్డంతో కాస్త వయసు మల్లిన వ్యక్తిగా సల్మాన్‌ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన సల్మాన్‌, ఆ తర్వాత యంగ్‌ లుక్ పోస్టర్ తో అభిమానులను అట్రాక్ట్‌ చేశాడు. ఇప్పుడు 1970ల్లోని ఓ గని కార్మికుడిగా సల్మాన్ దర్శనమిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న సల్మాన్‌. ‘‘మళ్లీ మన జీవితంలోకి వచ్చేశారు మేడమ్‌.. సర్‌’’ అంటూ ట్వీటారు. ఇందులో సల్మాన్‌ సర్‌తో పాటు, కత్రీనాకైఫ్‌ మేడమ్‌ని కూడా మనం చూడొచ్చు.