ఇన్‌స్టాగ్రామ్‌ లో ప్రభాస్ రికార్డు

SMTV Desk 2019-04-18 11:29:06  Prabhas, Instagram,

సాహో నటుడు ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్‌గా ఉండడన్న సంగతి తెలిసిందే. అభిమానులతో టచ్‌లో ఉండడానికి ఫేస్‌బుక్ మాత్రమే ఉపయోగిస్తాడు. కానీ ప్రభాస్ అభిమానులు ఆయన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలని డిమాండ్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టాడు. అభిమానుల కోరిక మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన ప్రభాస్ తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో లేదా వివరాలు కానీ పోస్ట్‌ చేయకముందే, అధికారికంగా ప్రకటించ ముందే ఆయన ఖాతాకు ఏడు లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చి చేరారు.

కేవలం ఖాతాకు యాక్టర్‌ ప్రభాస్‌ అన్న పేరు మాత్రమే పెట్టుకున్నాడు. ఆ ఒక్క పేరు చూసి ఇంత మంది నెటిజన్లు ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారంటే ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్‌ ఎంతో అర్థమవుతోంది. తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి ఫోటోను పోస్ట్ చేశాడు. బుధవారం రోజున ప్రభాస్ బాబుబలి 2 లోని తన ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోకు 12 గంటల లోపు 2 లక్షలకు పైగా లైకులు రావడం గమనార్హం.