ఈవిఎంల పనితీరులపై సుప్రీంను ఆశ్రయిస్తా!

SMTV Desk 2019-04-18 11:26:14  ka paul, election commission, supreme court

అమరావతి: బుధవారం మీడియాతో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో అవతవకలపై, ఈవిఎంల పనితీరులపై సుప్రీంను ఆశ్రయిస్తానని అన్నారు. ఈ అవకతవకలపై సమాధానం చెప్పేందుకు ఈసి నిరాకరిస్తుందని విమర్శించారు. అంతేకాక ఈవిఎంల పనితీరుపై సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. నర్సాపురంలో మధ్యాహ్నం వరకు ఈవిఎంలు పనిచేయలేదని, మూడో విడత ఎన్నికల బహిష్కరణకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా చాలా మంది నేతలు అంగీకరించారని చెప్పారు. ప్రధాని మోది విధానాలను రాజ్‌నాథ్‌ , గడ్కరీ వంటి నేతలే విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.