ఇన్ఫోసిస్ సీఈవో రాజీనామా.. అభిప్రాయ భేదాలే కారణం.!!

SMTV Desk 2017-08-18 10:43:17  infosis ceo, job Resigned, vishal sikka

బెంగుళూరు, ఆగస్ట్ 18 : ఐటీ సేవల దేశీయ దిగ్గజ సంస్థ అయిన ఇన్ఫోసిస్ లో సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్న విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజీనామాను బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. విశాల్‌ సిక్కా తను తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలను రాజీనామా లేఖలో వివరిస్తూ... "ఇన్ఫోసిస్ ఓ గొప్ప సంస్థని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల సంస్థలో వచ్చిన విభేదాలు, కస్టమర్లలో పెరుగుతున్న వ్యతిరేకత సంస్థ వృద్ధికి అడ్డంకులుగా నిలిచాయని పేర్కొన్నారు". ఇక రాజీనామాను ఆమోదించిన బోర్డు "సీఈవో పోస్టుకు రాజీనామా చేసినప్పటికీ, విశాల్ సిక్కా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో కొనసాగుతారని, ఆయన సేవలను మరింత కాలం పాటు వినియోగించుకుంటామని తెలిపింది. త్వరలోనే కొత్త ఎండీ, సీఈవోను ప్రకటిస్తామని" వివరించారు. ప్రస్తుతానికి సంస్థకు తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్ రావును నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.